- Advertisement -
న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలలో ఓటింగ్‌లో పాల్గొనరాదనే టిఎంసి నిర్ణయం పట్ల విపక్ష అభ్యర్థిని మార్గరేట్ అల్వా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పరస్పరం నిలదీసుకునే లేదా ఇగోకు దిగే లేదా ఆగ్రహాలు వ్యక్తం చేసుకునే సమయం కాదని అల్వా శుక్రవారం వ్యాఖ్యానించారు. ఎన్‌సిపి నేత శరద్ పవార్ నివాసంలో అల్వాను విపక్ష అభ్యర్థిగా ఎంపిక చేశారు.అయితే ఈ ఎంపిక తీరు సరిగ్గా లేదని, తమ పార్టీని పక్కదోవ పట్టించేలా ఉందని టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. ఓటింగ్‌కు వెళ్లబోమని పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీనిపై అల్వా మాట్లాడుతూ విభేదాలకు ఇది తరుణం కాదన్నారు. ధైర్యం, నాయకత్వ పటిమ, ఐక్యతలు ప్రదర్శించాల్సి ఉందని అన్నారు. మమత ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. ప్రతిపక్షాలతో నిలుస్తారని విశ్వసిస్తున్నానని తెలిపారు.
- Advertisement -