Sunday, January 19, 2025

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి..స్థానిక తడికెలపూడి ఎక్స్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పాల్వంచకు చెందిన యండిఅన్వర్ ,తడికెలపూడి గ్రామానికి చెందిన బానోత్‌ప్రభాస్ ,మరో మైనర్‌బాలుడు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారు.

వారివద్ద నుంచి 1కెజి 500 గ్రాముల విడి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పాల్వంచ నుంచి తరలిస్తున్నారని తెలిపారు. దీని విలువ సుమారు 3లక్షలు వుంటుందని కేసు నమోదు చేసి నిందుతులని రిమాండ్‌కు తరిలించన్నుట్లు సిఐ ఇంద్రసేనారెడ్డి ,యస్‌ఐ శ్రీనివాస్‌లు తెలిపారు.అక్రమంగా గంజాయిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎవరైనా గంజాయిని తరిలిస్తుంటే 100 కి డయల్‌ చేసి సమాచారం అందించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News