Thursday, January 23, 2025

షేక్‌పేట్‌లో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని గోల్కొండ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గోల్కండ ప్రాంతంలోని జియాబాగ్ కాలనీలోని శ్రీబాలజీ రెస్టారెంట్ అండ్ బార్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం ఎక్సైజ్ సిబ్బందికి వచ్చింది. వెంటనే హైదారాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు చంద్రశేఖర్‌గౌడ్, కోటమ్మ, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. షేక్‌పేటకు చెందిన అమన్‌సింగ్, సురేష్ సింగ్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి గంజాయి, రూ.17,200 నగదు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బంది గంజాయి ఎవరి వద్ద కొనుగోలు చేసిన విషయం విచారణ చేశారు. ధూల్‌పేటకు చెందిన కౌసల్య గాయత్రి, శోభాబాయి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పడంతో వారిపై కేసు నమోదు చేశారు. గంజాయి విక్రయించిన ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, హైదారాబాద్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News