Sunday, December 22, 2024

రైలులో గంజాయి రవాణా

- Advertisement -
- Advertisement -

తాండూరు : ట్రైన్‌లో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. శనివారం భువనేశ్వర్ నుంచి పుణె వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి 40 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో ఎక్సైజ్ సూపర్డెంట్ నవీన్ చంద్ర ఆదేశాల మేరకు తాండూర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. తాండూరు ఎక్సైజ్ సిఐ అనంతయ్య తెలిపిన వివరాల ప్రకారం…

తమిళనాడుకు చెందిన పీటర్ ఫ్రాన్సెస్ అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు 40 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎన్‌టిపిఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తనిఖీలలో తాండూర్ సిఎ అనంతయ్యతో పాటు వికారాబాద్ డిటిఎఫ్ సిఐ ధన్వంత్‌రెడ్డి, ఎస్‌ఐ కోటేశ్వర్లు, ఎస్‌ఐ చంద్రకాంత్, చిన్నరాయుడు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News