Thursday, November 21, 2024

అవినీతి కథా చిత్రం

- Advertisement -
- Advertisement -

మరికల్ తాహసీల్దార్ కార్యాలయంలో…. అవినీతి కథా చిత్రం  

మన తెలంగాణ వార్త ఎఫెక్ట్
విఆర్‌ఎ సస్పెన్సన్, మరొక రెవెన్యూ అధికారిపై వేటుకు రంగం సిద్ధం, ఈ ఘటనపై కలెక్టర్
సీరియస్, రైతు బుచ్చన్న భూమిని తిరిగి రిజిష్టర్ చేసిన విఆర్‌ఎ భార్య
ఊపిరి పీల్చుకున్న రైతు బుచ్చన్న
మన తెలంగాణకు రైతు థ్యాంక్స్
మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో:  నారాయణ పేట జిల్లా మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ లీలలు అంత ఇంత కాదు. రెవె న్యూ కార్యాయంలో గత మూడు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రై తు బుచ్చన్నకు మోసం చేసిన రెవెన్యూ అధికారు లు కలెక్టర్ ఆదేశాలతో ఖంగుతిన్నారు. రైతు బుచ్చన్నకు చెందిన వ్యవసాయ భూమిని అక్రమంగా రి జిష్టర్ చేసుకొని ధరణిలో నమోదు చేసుకున్న విషయాలను వరుస కథనాలతో మన తెలంగాణ దిన పత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన కలెక్టర్ కోయ హర్ష మరికల్ తహసీల్దార్ కార్యాలయ ం అధికారులపై సీరియస్ అయ్యారు.

ఇందుకు కా రణమైన విఆర్‌ఎను సస్సెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరొక రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శా ఖపరమైన చర్యలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత చినాన్న రైతు బుచ్చన్నకు చెందిన 30.30 గుంటలను అక్రమం గా ధరణిలో తన భార్య, అన్న భార్యలపై రిజిష్టర్ చేసుకున్న విష యం తెలిసిందే. ఈ విషయంపై కూ డా రైతు బు చ్చన్న కూతురు నీలమ్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు కూడా నమోదు అ య్యింది. ఈ విషయాలపై మన తెలంగాణ పత్రిక వరుస కథనాలతో ప్రచురించింది. దీంతో కలెక్టర్ విచారణకు ఆ దేశించారు.

ఈ విచారణలో నిజం తేలడంతో విఆర్‌ఎ సస్పెన్సన్ చేస్తూ ఉత్తర్వులు జా రీ చేశారు. అయితే సస్పెన్సన్‌కు ముందు రోజే విఆర్‌ఎ తన భార్య పేరుతో రిజిష్టర్ చేసుకున్న భూ మిని, తన అన్న భార్య భూమిని తిరిగి రైతు బుచ్చన్నకు రిజిష్టర్ చేయడంతో కథ సుఖాంతం అయ్యిం ది. అయి తే రైతు బుచ్చన్న భూమిని రిజిష్టర్ చేయడంతో విఆర్‌ఎ చేసిన అవినీతి, అక్రమాలు రుజు వు అయినట్లేనని భావిస్తున్నారు. ఈ విషయంపై మరికల్ తహసీల్దార్‌ను వివరణ కోరగా విఆర్‌ఎ హనుమంతును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇ ందులో మరొక రెవెన్యూ అధికారిపై చర్యలు ఉం టాయా అన్న ప్రశ్నకు ఆయన ఇప్పటి వరకు అయి తే విఆర్‌ఎపై చర్యలు తీసుకున్నామని, ముందు ముందు ఎలా ఉంటుందోపై అధికారులు నిర్ణయం బట్టి ఉంటుందని ఆయన మన తెలంగాణకు తెలిపారు.

విఆర్‌ఎనే షాడో అధికారి:

సస్పెన్సన్ గురైన విఆర్‌ఎనే కార్యాలయంలో అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఏ పని కావాలన్నా ఈయన ద్వారానే జరుగుతోందన్న భా వన కల్గించి చక్రం తిప్పేవారని తెలుస్తోంది. భూ ములు, ఇతర సర్టిఫికెట్లు కోసం అధికారుల కంటే విఆర్‌ఎను కలిసి పనులు చేయించుకునే వారని తెలుస్తోంది. ప్రతి ఒక్కరి నుంచి మామూళ్లు ఈయనే వసూళ్లు చేసుకునే వారని మరి కొందరు ఆరోపిస్తున్నారు.

మన తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన రైతు కుటుంబీకులు

రైతు బుచ్చన్నకు జరిగిన అన్యాయంపై మన తెలంగాణలో కథనాలు రావడంతో పాటు కలెక్టర్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రైతు బుచ్చన్నకు న్యాయం జరిగింది. తమ భూమి తమకు దక్కింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌తో పాటు మన తెలంగాణకు రైతు బుచ్చన్నతో పాటు ఆయన కూతురు నీలమ్మ థ్యాంక్స్ చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News