Thursday, January 23, 2025

హాస్టల్‌లో యువతి మృతదేహం నగ్నంగా… సెక్యూరిటీ గార్డు ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: సావిత్ర భాయ్ ఫూలే హాస్టల్ యువతి మృతదేహం నగ్నంగా ఉండడంతో పాటు గాయాలున్న సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని మెరినా డ్రైవ్ ప్రాంతంలో జరిగింది. మెరినా డ్రైవర్ హాస్టల్ సెక్యూరిటీ గార్డు కూడా ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అకోలా జిల్లాకు చెందిన ఓ యువతి బంద్రాలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చదువుతోంది. ఓ కంపెనీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ మెరినా డ్రైవ్ లోని సావిత్ర భాయ్ ఫూలే గర్ల్స్ హాస్టల్‌లో ఉంటుంది. హాస్టల్‌లోని ఫోర్త్ ఫ్లోర్‌లో ఓ రూమ్‌లో యువతి ఒంటరిగా ఉంటుంది.

Also Read: ప్రియురాలు కోసం రైల్వే సిగ్నల్‌పై దాడి…

రూమ్ లోపల నుంచి లాక్ వేయడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా యువతి మృతదేహం నగ్నంగా కనిపించింది. యువతి మర్మాంగాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు. యువతిపై అత్యాచారం చేసిన హత్య చేశారని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సెక్యూరిటీ గార్డు ఓంప్రకాశ్ కనోజియా కనిపించకపోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చార్ని రోడ్డులో ఓం ప్రకాశ్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓం ప్రకాశ్ యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News