Saturday, November 16, 2024

శిక్షణలో తెరుచుకోని ప్యారాచూట్..కమాండో మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణలో అపశ్రుతి చోటు చేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ మెరైన్ కమాండో చందక గోవింద్( 31) ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో ఆయన స్వస్థలమైన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్లలో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా పనాఘర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆయన శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శిక్షణలో భాగంగా బుధవారం ఆయన ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి కిందికి దూకగా ప్యారాచూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాల పాలయ్యారు.

తీవ్ర గాయాలతో ఉన్న గోవిందును హుటాహుటిన బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా పనాగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కాగా గోవింద్ మృతి పట్ల నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. కాగా గోవిందు భౌతిక కాయం శుక్రవారం ఆయన స్వగ్రామానికి చేరుకుంటుందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News