Monday, November 18, 2024

మారియన్ బయోటెక్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఫార్మ్ ఎక్స్‌సిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ సంస్థకు చెందిన దగ్గుమందు కారణంగా ఉజ్బెకిస్థాన్‌లో పలువురు చిన్నారులు మృతిచెందారన్న వార్తలపై తాము పంపిన నోటీసుకు ఆ కంపెనీ సమాధానం ఇవ్వక పోవడంతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మ్‌ఎక్స్‌సిల్) ఆ సంస్థ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది.

ఒక వేళ ఆ సంస్థ సభ్యత్వాన్ని కోల్పోతే అది కొన్ని ప్రోత్సాహకాలను కోల్పోతుందని కౌన్సిల్ తెలిపింది. ‘మీ వైపునుంచి జరిగిన తీవ్ర పరిణామాలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా, తదుపరి చర్యల కోసం వీలయినంత త్వరగా నివేదిక సమర్పించాల్సిందిగా మిమ్మల్ని కోరడమైనది. ఈ నెల 29 నాటికి అవసరమైన సమాచారాన్ని సమర్పించని పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండా ఈ రిజిస్ట్రేషన్ కమ్ సభ్యత్వ సర్టిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయడం జరుగుతుంది’ అని ఫార్మ్‌ఎక్స్‌సిల్ ఈ నెల 28న మారియన్ బయోటెక్‌కు పంపిన నోటీసులో తెలిపింది. 2010లో ఒక స్మాల్‌స్కేల్ ఉత్పత్తిదారుగా కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన మారియన్ బయోటెక్ 2016నుంచి వాణిజ్య ఎగుమతిదారుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News