Monday, January 20, 2025

మారియుపోల్ విముక్తి పొందింది: పుతిన్

- Advertisement -
- Advertisement -

Mariupolమాస్కో: దిగ్గజం అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌తో పాటు ఉక్రేనియన్ ఓడరేవు నగరాన్ని మాస్కో నియంత్రలోకి తీసుకుందని రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తనతో చెప్పటంతో,  అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మారియుపోల్‌కు రష్యా “విముక్తి”ని కల్పించిందన్నారు. అజోవ్ సముద్రంలోని మారియుపోల్‌పై పూర్తి నియంత్రణ సాధించడం రష్యాకు ప్రధాన వ్యూహాత్మక విజయం.  ఇది తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల భూభాగాలకు విలీనమైన ‘క్రిమియా’ను అనుసంధానించడంలో సహాయపడుతుంది. “మారియుపోల్ విముక్తి పొందింది” అని  టెలివిజన్ సమావేశంలో షోయిగు పుతిన్‌తో అన్నారు. “మిగిలిన జాతీయవాద నిర్మాణాలు అజోవ్‌స్టాల్ ప్లాంట్ యొక్క పారిశ్రామిక జోన్‌లో ఆశ్రయం పొందాయి.” దాదాపు 2,000 మంది ఉక్రేనియన్ సైనికులు ప్లాంట్‌లోనే ఉన్నారని షోయిగు తెలిపారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News