Monday, December 23, 2024

‘మార్క్ ఆంటోని’ సెన్సార్ పూర్తి

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ విశాల్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా ‘మార్క్ ఆంటోని’ మూవీ ఈనెల 15న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం 150 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటించింది. సునీల్, సెల్వ రాఘవన్, రీతూ, అభినయ, కింగ్స్‌లీ, యం.జి.మహేంద్రన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మార్క్ ఆంటోని చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News