Saturday, November 16, 2024

మూడో టెస్టుకు ముందు రూట్ సేనకు షాక్..

- Advertisement -
- Advertisement -

లండన్: భారత్‌తో జరిగే మూడో టెస్టుకు ముందు ఆతిథ్య ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ దూరమయ్యాడు. లార్డ్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టు సందర్భంగా వుడ్ గాయానికి గురయ్యాడు. బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో వుడ్ చేతికి గాయమైంది. అయితే ఆ టెస్టులో ఎలాగోలా నెట్టుకు వచ్చిన మార్క్‌వుడ్ మూడో టెస్టుకు మాత్రం అందుబాటులో లేకుండా పోయాడు. వుడ్ కుడి భుజానికి గాయమైంది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో అతను లీడ్స్‌లో జరిగే మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ బోర్డు ధ్రువీకరించింది. ఇప్పటికే లార్డ్ మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలై ఇబ్బందుల్లో ఉన్న ఇంగ్లండ్‌కు వుడ్ దూరం కావడం పెద్ద షాక్‌గానే చెప్పొచ్చు.

ఈ సిరీస్‌లో నిలకడైన బౌలింగ్ చేస్తున్న ఇంగ్లండ్ బౌలర్ వుడ్ ఒక్కడే కావడం గమనార్హం. అతను దూరం కావడంతో భారత్‌ను కట్టడి చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు మరింత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే స్టార్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్‌లు గాయాల వల్ల సిరీస్‌కు దూరమయ్యారు. స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ సేవలు కూడా ఇంగ్లండ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇలాంటి స్థితిలో మార్క్‌వుడ్ వంటి స్టార్ బౌలర్ దూరం కావడాన్ని ఇంగ్లండ్ టీమ్ జీర్ణించుకోలేక పోతోంది. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమయం చేయాలని భావిస్తున్న రూట్ సేనకు వుడ్ లోటును పూడ్చుకోవడం అనుకున్నంత తేలికేం కాదు. సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సర్ రెండో టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. ఇలాంటి స్థితిలో వుడ్ సేవలు కోల్పోవడం కూడా ఇంగ్లండ్‌కు షాక్‌గానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Mark Wood ruled out from 3rd Test vs India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News