Wednesday, January 22, 2025

ముకేశ్‌ను అధిగమించిన జుకర్‌బర్గ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మార్క్ జుకర్‌బర్గ్ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి 12వ స్థానానికి చేరుకున్నారు. మెటా స్టాక్‌లో పెరుగుదల కారణంగా ఆయన అంబానీని అధిగమించారు. అంతకుముందు జుకర్‌బర్గ్ 13వ స్థానంలో ఉన్నాడు. మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ ఏప్రిల్ 27న 10 బిలియన్ డాలర్లకు (రూ. 81.77 వేల కోట్లు)కు పైగా పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర విలువ 77.1 బిలియన్ డాలర్లు (రూ. 6.30 లక్షల కోట్లు) నుండి 87.3 బిలియన్ డాలర్లకు(రూ. 7.13 లక్షల కోట్ల)కు పెరిగింది.

ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీ నికర విలువ 82.4 బిలియన్ డాలర్లు (రూ. 6.73 లక్షల కోట్లు)తో 13వ స్థానానికి చేరుకున్నారు. అయితే ఫేస్‌బుక్ మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి) ఫలితాలు బాగుండడం వల్ల మెటా స్టాక్ బూమ్‌ను చూసింది. దీని వల్ల జుకర్‌బర్గ్ నికర విలువలో పెరుగుదల కనిపించింది. అంతకుముందు రోజు 13.93 శాతం లాభంతో మెటా స్టాక్ 238.56 డాలర్ల వద్ద ముగిసింది. యాక్టివ్ యూజర్ల సంఖ్య పెరగడం వల్ల ఎక్కువ యాడ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ యూజర్ల సంఖ్య పెరగడం వల్లే కంపెనీకి ఎక్కువ యాడ్స్ వచ్చాయని మెటా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News