Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్  తీవ్రంగా గాయపడిన సంఘటన ఎపిలోని ప్రకాశం జిల్లాలోని శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మార్కాపురం సబ్ కలెక్టర్ ప్రయాణిస్తున్న కారుని మర్రిచెట్లపాలెం వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సబ్ కలెక్టర్ తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News