Wednesday, January 22, 2025

మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: ముచ్చటగా మూడు రోజులపాటు పెరుగుతూ పోయిన భారత స్టాక్ మార్కెట్ గురువారం (మార్చి 9న) దిగజారింది. ఆటో, ఐటి, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్‌కు కళ్లెంవేసి వెనక్కి లాగేశాయి. నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 541.81 పాయింట్లు లేక 0.90 శాతం తగ్గి 59806.28 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 164.80 పాయింట్లు లేక 0.93 శాతం తగ్గి 17589.60 వద్ద ముగిసింది.

మార్కెట్ ఆరంభంలో స్తబ్ధుగా మొదలయింది. తర్వాత బేర్స్ ఛార్జీ తీసుకుని అమ్మకాలకు దిగారు. సెకండ్ హాఫ్‌లో కూడా అమ్మకాలు కొనసాగించారు. దాంతో మార్కెట్ సూచీలు కీలక స్థాయి నుంచి దిగిపోయాయి. మార్కెట్ సూచీలు రోజు వారీ కనిష్ఠ స్థాయిలోనే ముగిశాయి.

నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎం అండ్ ఎం, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయెన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్ ప్రధానంగా నష్టపోయాయి. కాగా టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, భారతీ ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్‌స, యాక్సిస్ బ్యాంక్ ప్రధనంగా లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో షార్ట్ బిల్డప్ కనిపించింది. కాగా మణప్పురంలో లాంగ్ బిల్డప్ కనిపించింది. టెక్నికల్‌గా చూసినప్పుడు నిఫ్టీ బేరిష్ క్యాండిల్‌ను రూపొందించింది. మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ ఆదిలో పాజిటివ్‌గానే ఓపెన్ అయినప్పటికీ తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా రోజువారి కనిష్ఠానికి చేరుకుంది. డైలీ ఛార్ట్ ప్రకారం 40 రోజుల మూవింగ్ యావరేజ్(17764) వద్ద బలమైన రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News