Sunday, December 22, 2024

టాప్ 8 కంపెనీల మార్కెట్ క్యాప్

- Advertisement -
- Advertisement -

రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది..

ముంబై : సెన్సెక్స్‌లోని టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అత్యధికంగా లాభపడింది. గత వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్ 716.16 పాయింట్లు లేదా 0.97 శాతం లాభపడింది. గత వారం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి), ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్), ఎస్‌బిఐ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ పెరిగింది.

మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి,ఇఎస్), ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.38,477 కోట్లు క్షీణించాయి. సెన్సెక్స్‌లోని టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత టిసిఎస్ రెండో స్థానంలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మూడో స్థానంలో నిలిచాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, ఎల్‌ఐసి, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటిసిలు ఈ టాప్ 10 కంపెనీల జాబితాలో ఉన్నాయి. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.43,976 కోట్లు పెరిగి మొత్తం రూ.20,20,470.88 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.27,012 కోట్లు పెరిగి రూ.7,44,808 కోట్లకు, ఎల్‌ఐసి రూ.17,235 కోట్లు పెరిగి రూ.6,74,655 కోట్లకు, ఐటిసి మార్కెట్ క్యాప్ రూ.8,548.19 కోట్లు పెరిగి రూ.40.133 కోట్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News