Sunday, January 26, 2025

మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ఏఎంసీ చైర్మన్ పుల్గం సాయిరెడ్డి అద్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్టర్లతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఏఎంసీ నూతన పాలకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి రైస్ మిల్స్, చెక్‌పోస్టుల ద్వారా 9 లక్షల 48 వేల ఆదాయం వచ్చిందన్నారు. కోటి 47 లక్షల ప్రభుత్వ ఆదాయం కాగా గోదాముల నుండి 10 లక్షల ఆదాయం వచ్చినట్లు చైర్మన్ సాయిరెడ్డి తెలిపారు.

ఇందులో సిబ్బందికి మూడు నెలల వేతనాలకు 15 లక్షలు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వడ్ల రాజెందర్, కార్యదర్శి గంగు, సూపర్‌వైజర్ లక్ష్మీనర్సయ్య, డైరెక్టర్లు మాలోత్ సర్దార్, సిద్దిరాములు, మొహమ్మద్ సాధిక్ అలీ, నాగరాజ్ గౌడ్, నడిపల్లి ప్రభాకర్ రావు, గడిల దత్తురావు,తోట మధుకర్, దండిబోయిన సిద్దిరాములు, బి.పెద్ద రాజిరెడ్డి, గొర్రె మహేశ్వరి, కాట్యాడ రామారావు, బానోత్ ప్రేమ్‌దాస్,సొసైటి చైర్మన్ వరికెల కమలాకర్‌రావు, సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News