Wednesday, January 22, 2025

రూ.100 కోట్లతో మార్కెట్ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • అబ్బురపడే విధంగా మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం
  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ కార్పొరేషన్:- పండ్ల, కూరగాయల మార్కెట్ ప్రాంతీయ, జిల్లా మార్కెటింగ్ అధికారుల నూతన భవన సముదాయ నిర్మాణం కొరకు లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో నాలుగు కోట్ల 18 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎనమాముల మార్కెట్ చైర్మన్ దిద్ది భాగ్యలక్ష్మి కుమారస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధీనంలో 4 కోట్ల 18 లక్షల రూపాయల వ్యయంతో అధికారుల రీజినల్ ఆఫీస్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. 50 కోట్ల మున్సిపల్ నిధులతో రీజినల్ ఆఫీస్‌కు సంబంధించిన అన్ని కార్యాలయాలను ఈ కార్యాలయంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఫ్రూట్ మార్కెట్ రూ.28 కోట్లతో నిర్మాణం జరుగుతుందని నూతనంగా మరో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ రెండింటి మధ్యలో నాన్ వెజ్ మార్కెట్, వెజ్ మార్కెట్ సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. మార్కెట్ చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేసి బయట ఎవరు అమ్మకాలు జరపకుండా మార్కెట్‌లోనే వ్యాపారం జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మార్కెట్ నిర్మాణం తర్వాత పై అంతస్తులలో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని పక్కా ప్రణాళిక ప్రకారం మార్కెట్ అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తాము తాపత్రయ పడేది ప్రజలకోసం ప్రజల సౌకర్యం కోసమేనన్నారు. నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు జరిగిందని అతి పెద్ద మార్కెట్ మన కూరగాయల మార్కెట్ అని మరే ఇతర మార్కెట్లు ఏర్పాటు చేయడానికి సైతం ఇంత పెద్ద స్థలం లేవని ఉన్న దాన్ని గొప్పగా మార్చుకొని పై అంతస్థులను నిర్మాణం చేసుకొని సద్వినియోగం చేసుకుందా మన్నారు. పండ్ల మార్కెట్ వారికి 20 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలపడం జరిగిందని, గతంలోనే పది ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని అతి త్వరలో మరో పది ఎకరాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

అందర్నీ కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది స్థానిక ఎమ్మెల్యేగా తనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 36 ఉన్న లైసెన్సులను 99 లైసెన్స్ లో అందించడం జరిగింది సుమారు 170 ఫ్లాట్లను అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ఉపాధి కల్పన అనేది జరగాలి వ్యాపారస్తులు గొప్పగా వ్యాపారం చేసుకుని లాభాలు సంపాదించాలనే గొప్ప సంకల్పంతో తాము పని చేస్తున్నామని మార్కెట్ అంతా లాకింగ్ సిస్టం ద్వారా పూర్తిస్థాయిలో ప్రహరీ గోడ ఏర్పాటు చేసి బయట అమ్మే వాళ్ళని సైతం లోపల అవకాశం కల్పించడం జరిగిందని, ఇక్కడ ఉన్న వాళ్ళు గొప్పగా బతకాలనే తప్ప ప్రభుత్వం కోసం కాదని అందుకె ఒక గొప్ప సంకల్పంతో పని చేయడం జరుగుతుందన్నారు.

ప్రతి నిర్ణయం అందరిని సంప్రదించి తీసుకోవడం జరిగిందని గతంలో టాయిలెట్స్,రెస్ట్ రూమ్ లేవని నేడు టాయిలెట్స్ రెస్ట్ రూమ్ హోటల్ లాంటివి నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. వరంగల్ మార్కెట్ అబ్బురపడే విధంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పండ్ల మార్కెట్ 28 కోట్లు, నేడు శంకుస్థాపన చేసిన రీజినల్ ఆఫీస్ నాలుగు కోట్ల 68 లక్షలు, అదనంగా పండ్ల మార్కెట్ కు మరో 27కోట్లు మొత్తంగా 100 కోట్లతో ఈ మార్కెట్ను అభివృద్ధి చేయబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

తదనంతరం నూతనంగా నిర్మిస్తున్న పండ్ల మార్కెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీ వాత్సవ్, మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ మాజీ చైర్మన్లు నియోజకవర్గ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ కూరగాయలు పండ్ల మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు వ్యాపారస్తులు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News