Thursday, January 23, 2025

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -
Sensex ends flat
ఐటి, ప్రభుత్వ రంగ బ్యాంకులు కుదేలుకాగా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు పెరిగాయి.

ముబై: జూలై 14న అత్యంత అస్థిరమైన సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్ గా  ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు లేదా 0.18% క్షీణించి 53,416.15 వద్ద,  నిఫ్టీ 28 పాయింట్లు లేదా 0.18% క్షీణించి 15,938.70 వద్ద క్లోజ్ అయ్యాయి.  దాదాపు 1360 షేర్లు పురోగమించగా, 1880 షేర్లు క్షీణించాయి,  137 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా తటస్థంగా నిలిచాయి. నిఫ్టీలో ఒఎన్‌జిసి, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,  మారుతీ సుజుకీ  టాప్ గెయినర్స్‌గా నిలువగా,  హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా , ఎస్‌బిఐ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సెక్టోరల్‌ పరంగా చూసినట్లయితే  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,  పిఎస్‌యు బ్యాంక్ సూచీలు 1-2 శాతం పతనమవ్వగా, ఆయిల్ అండ్ గ్యాస్ , పవర్ సూచీలు 1-1.6 శాతం మేరకు లాభపడ్డాయి. కాగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

భారత రూపాయి గత ముగింపు 79.63తో పోలిస్తే… నేడు డాలర్‌కు 79.87 వద్ద తాజా రికార్డు స్థాయిలో ముగిసింది. ఒక్కో షేరుకు రూ.734 చొప్పున గూగుల్‌కు 7.11 కోట్ల షేర్ల ప్రాధాన్యత కేటాయింపును భారతి ఎయిర్‌టెల్ ఆమోదించింది.ఎస్ఈఐ నుంచి టొరెంటో పవర్ రూ. 2600 కోట్ల ఆర్డరును పొందింది. సౌదీ అరేబియాలోని సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ నుంచి వెల్ స్పన్ కార్పొరేషన్ రూ. 689 కోట్ల ఆర్డరును చేజిక్కించుకుంది. ఏసిసి, ఎల్ అండ్ టి ఇన్పోటెక్ నేడు(జూలై 14) తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. జూలై 26న ఒక్కసారికి ప్రత్యేక డివిడెండ్ ను ఇవ్వాలని సనోఫి ఇండియా యోచిస్తోంది. ఎల్ అండ్ టి  ఇన్ఫోటెక్ క్యూ1 (ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ పై)  లాభం 28% పెరిగి రూ. 634 కోట్లకు చేరుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News