ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారంభారీ నష్టాల్లో ముగశాయి. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు రోజంతా కోలుకోనేలేదు. చివరికి సెన్సెక్స్ 567.98 పాయింట్లు కోల్పోయి 55107.34 వద్ద, నిఫ్టీ 153.2 పాయింట్లు నష్టంతో 16416.35 వద్ద ముగిసింది. అన్ని సెక్టార్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ ధోరణిలో కొనసాగాయి. నిఫ్టీలో ఓఎన్‌జిసి, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, మారుతి సుజుకీ, హీరో మోటోకార్పొరేషన్ లాభాపడగా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, లార్సెన్ అండ్ టూబ్రో నష్టాల్లో ట్రేడయ్యాయి. గుజరాత్ గ్యాస్, టైటాన్, ఎంఆర్‌ఎఫ్‌లో షార్ట్ బిల్డప్ కనిపించగా, ఓఎన్‌జిసి, ఇండస్ టవర్స్, గెయిల్‌లో లాంగ్ బిల్డప్ రూపొందింది.
బిఎస్‌సిలో 3418 స్టాకులు ట్రేడవ్వగా… 1286 స్టాకులు లాభపడ్డాయి, 2011 స్టాకులు నష్టపోయాయి, 121 స్టాకులు ఎలాంటి మార్పులు లేకుండా తటస్థంగా నిలిచాయి. ఆర్‌బిఐ క్రెడిట్ పాలసీ ప్రకటన రానున్నందున చాలా మంది వేచి చూసే ధోరణిని అనుసరించారు. కాగా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు రేట్లు పెంచుతారని అనేకమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ పడిపోతున్న తరుణంలో విదేశీ సంస్థాగత మదుపరులు అడ్డుఅదుపులేకుండా అమ్మకాలకు పాల్పడుతున్నారు. టెక్నికల్‌గా చూసినప్పుడు నిఫ్టీ 16450 సపోర్టు లెవల్‌ను కూడా దాటేసింది. ఇది నెగటివ్ ధోరణిలో ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే స్వల్పకాలిక బలహీనతను కనబరుస్తోంది. ట్రేడర్ల దృష్టిలో నీఫ్టీ సూచీ 16500 కింద ట్రేడవుతుంటే బలహీనంగా ఉన్నట్లే, పైగా కరెక్షన్ వేవ్ 16300 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ 16500కన్నా పైకి వస్తే 16600-16650 వరకు వెళ్లగలదు.