వారంలో, సెన్సెక్స్ 2,041.96 పాయింట్లు లేదా 3.72 శాతం క్షీణించగా, నిఫ్టీ 629.05 పాయింట్లు లేదా 3.83 శాతం క్షీణించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఆరో రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. శుక్రవారం ఉదయం భారీ లాభాలతో మొదలైనప్పటికీ చివరికి అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఇంట్రాడే లాభాలు చివరికి తుడుచుపెట్టుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాపిట్ మార్కెట్‌లో ఉన్న భయాలే స్టాక్ మార్కెట్ పతనానికి కారణమవుతున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 136.69 పాయింట్లు కోల్పోయి 52,793.62 వద్ద క్లోజ్ అయింది. కాగా నిఫ్టీ 25.80 పాయింట్లు కోల్పోయి 15,782.20 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్ ముగిసే సమయానికి రూ. 77.48 వద్ద ట్రేడయింది. సెన్సెక్స్‌లో సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, ఐటిసి, టైటన్, రిలయన్స్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ లాభాల్లో ముగియగా, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.