Friday, November 22, 2024

మార్కెట్ 3 రోజు నష్టాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

సెన్సెక్స్,  నిఫ్టీలు బుధవారం ఇతర ఆసియా మార్కెట్లు సెట్ చేసిన ట్రెండ్‌ను అనుసరించి సానుకూల నోట్‌తో ప్రారంభమయ్యాయి, వ్యాపారులు అమెరికా మాంద్యం ఆందోళనలను పునఃపరిశీలించారు. అదనంగా, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తి పన్ను నిబంధనలను సడలించడంతో దేశీయ రియల్ ఎస్టేట్ స్టాక్‌లు పెరిగాయి. రేపు(గురువారం) భారత రిజర్వ్ బ్యాంక్ పాలసీ వివరాలు వెలువడనున్నందున మార్కెట్ లోని అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. అన్ని రంగాలు గ్రీన్ లోనే ముగిశాయి.

నేడు సెన్సెక్స్ 874.94 పాయింట్లు లేక 1.11 శాతం పెరిగి 79468.01 వద్ద క్లోజ్ అయింది. కాగా నిఫ్టీ 304.96 పాయింట్లు లేక 1.27 శాతం పెరిగి 24297.50 వద్ద క్లోజ్ అయింది. బంగారం రూ. 251 . 00 లేక 0.36 శాతం తగ్గి రూ. 70004.00 వద్ద ట్రేడయింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 0.03 పైసలు లేక 0.04 శాతం తగ్గి రూ. 83.95 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 50లో ఓఎన్జిసి, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రయిజెస్, అదానీ పొర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రధానంగా లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషెర్ మోటార్స్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, టైటాన్ కంపెనీ ప్రధాన లూజర్స్ గా నిలిచాయి.  మొత్తం 13 ప్రధాన రంగాలు లాభాలను నమోదు చేశాయి. రియల్టీ ఇండెక్స్ 2 శాతం ఎగసింది.

బలమైన ఓపెనింగ్ తర్వాత, ఇండెక్స్ ఓ  శ్రేణిలో ఊగిసలాడింది ,  చివరికి 304.95 పాయింట్ల లాభాలతో 24,297.05 వద్ద సెషన్‌ను ముగించింది. మెటల్ , మీడియా టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉండటంతో అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి. మిడ్ ,స్మాల్ క్యాప్స్ వరుసగా 2.45% & 2.86% పురోగమించాయి ,  బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ ను అధిగమించాయి.

నిఫ్టీ50 గ్రీన్ క్యాండిల్ని ఏర్పరిచింది,  అయితే దాని లాంగ్ లెగ్  డోజీ  నమూనా ఇప్పటికీ అనిశ్చితతను సూచిస్తోంది. ఇండెక్స్ 23,960 మద్దతు స్థాయిని కలిగి ఉన్నంత వరకు, 24,700 తర్వాత 24,550కి ఎగబాకే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News