Wednesday, January 22, 2025

దాదాపు రూ. 5 లక్షల కోట్లు తుడిచేసిన మార్కెట్ క్రాష్ !

- Advertisement -
- Advertisement -

sensex

ముంబై: ఒక్క రోజులోనే మదుపరుల  5 లక్షల కోట్ల రూపాయలకుపైగా నేడు(సోమవారం) దేశీయ మార్కెెట్లు తుడిచిపెట్టాయి. ఆది నుంచే మార్కెట్ బలహీనంగా కొనసాగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకుంది. అమెరికా ద్రవోల్బణ డేటాతో విశ్లేషకులు వారి స్టాన్స్ మార్చుకున్నారు. భారత వినియోగ ధర డేటాను ఈ రోజున తదుపరి విడుదల చేయనున్నారు. నిక్కీ, హాంగ్సెంగ్, కోస్పి, షాంఘై కాంపోజిట్, ఆస్ర్టేలియా ఎఎస్ఎక్స్, డో జోన్స్, నాస్డాక్ కాంపోజిట్ వంటి సూచీలు కూడా నేడు నష్టాన్ని చూపాయి. ప్రతి రంగం షేర్లు బేర్ గుప్పిట చిక్కాయి. రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. డాలరుకు మారకం రేటు 78.28గా నిలిచింది.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1456.74 పాయింట్లు పతనమై 52846.70 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 427.40 పాయింట్లు పతనమై 15774.40 వద్ద ముగిసింది. 650 షేర్లు లాభపడగా, 2759 షేర్లు నష్టపోయాయి. 117 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా నిలిచాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్ భారీగా నష్టపోగా, నెస్టే ఇండియా, బజాజ్ ఆటో లాభపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News