Sunday, November 24, 2024

6వ రోజూ లాభాలలో ముగిసిన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -
sensex
56 వేల మార్కును తిరిగి చేరుకున్నసెన్సెక్స్ 

ముంబై: విదేశీ మదుపరుల కొనుగోళ్లు , సానుకూల గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌ల మధ్య బిఎస్‌ఇ సెన్సెక్స్ 390 పాయింట్లకు పైగా ఎగబాకి 56,000 మార్కుపై స్థిరపడింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ కౌంటర్లలో కొనుగోళ్ల జోరు కూడా సూచీలను పెంచింది. వరుసగా ఆరో సెషన్‌లో 30 షేర్ల బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ 390.28 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 56,072.23 వద్ద స్థిరపడింది. నేడు  ఇది 504.1 పాయింట్లు లేదా 0.90 శాతం పురోగమించి 56,186.05 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 114.20 పాయింట్లు లేదా 0.69 శాతం పెరిగి 16,719.45 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌ షేర్లలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు ప్రధానంగా నష్టపోయాయి. కాగా, అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.51 శాతం తగ్గి 103.33 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం నికర కొనుగోలుదారులుగా నిలిచారు.  ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 1,799.32 కోట్ల విలువైన షేర్లను వారు కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News