Sunday, January 19, 2025

ఐటి షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ దాదాపు 93 పాయింట్ల లాభంతో 66,023.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు 28 పాయింట్ల లాభంతో 19,812 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగింది. క్షీణత నుంచి మార్కెట్ కోలుకోవడంలో ఐటి షేర్లు అత్యధికంగా దోహదం చేశాయి.

ఇన్ఫోసిస్ షేర్లు గరిష్టంగా 1.22 శాతం లాభంతో ముగిశాయి. టెక్ మహీంద్రా, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్ వంటి ఐటి షేర్లు కూడా లాభదాయకంగానే ఉన్నాయి. విప్రో స్వల్ప నష్టాలను చవిచూసింది. ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వంటి షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. టైటాన్, ఐటిసి 1 శాతం లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి కొనసాగింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ అత్యధికంగా 2 శాతానికి పైగా పడిపోయింది.

బాండ్లు జారీ ఆలోచనలేదు: జియో ఫైనాన్స్
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్లను జారీ చేస్తోందని, దీని ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల సమీకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పందించింది. ప్రస్తుతం బాండ్ల ద్వారా నిధులు సేకరించే ఆలోచన లేదని కంపెనీ తెలిపింది. దీంతో బాండ్ల జారీ వార్తను కంపెనీ కొట్టిపారేసింది. మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారం ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News