Sunday, December 22, 2024

వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్లు ఢమాల్ !

- Advertisement -
- Advertisement -

ముంబై: మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లు వరుసగా మూడో రోజున కూడా నేల చూపులే చూశాయి.  ఈక్విటీ బెంచ్ మార్క్ లైన సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఐటి స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. విదేశీ నిధులు వైదొలగడం కూడా మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 456.10 పాయింట్లు లేక 0.62 శాతం పతనమై 72943.68 వద్ద సెటిల్ అయింది. నిఫ్టీ 124.60 పాయింట్లు లేక 0.56 శాతం పతనమై 22147.90 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో ఐషెర్ మోటార్స్, డివీస్ లాబ్స్, టైటాన్ కంపెనీ, హెచ్ యుఎల్ ప్రధానంగా లాభపడగా, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ టిఐ మైండ్ ట్రీ , విప్రో నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ దిగువన స్థిరపడ్డాయి. ఇక యూరొపియన్ మార్కెట్ లైతే రెడ్ లో కోట్ అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ సోమవారం నెగటివ్ గా ముగిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News