Monday, January 20, 2025

స్టాక్‌మార్కెట్లు చక్కటి నియంత్రణలో ఉన్నాయి: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చక్కటి నియంత్రణలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వివాదం వద్దని ఆమె అన్నారు. దానివల్ల మదుపరుల విశ్వాసం దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ గ్రూప్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ మొత్తం పెట్టుబడిలో 120 బిలియన్ డాలర్లకుపైగా సంపద తుడిచిపెట్టుకుపోయింది. అదానీ గ్రూప్ స్టాక్ మాన్యిపులేషన్‌కు, మోసాలకు పాల్పడ్డాయని ఆ రీసెర్చ్ సంస్థ ఆరోపించింది. అయితే అదానీ గ్రూప్ మాత్రం హిండెన్‌బర్గ్ రిపోర్టును నిరాధారం, తప్పులతడక అని కొట్టిపారేసింది.

‘ఒక్క విషయం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా రచ్చ అయినప్పటికీ, అది చక్కని నియంత్రణలో ఉన్న భారతీయ ఆర్థిక మార్కెట్‌ను ప్రభావితం చేయలేవు’ అని నిర్మల చెప్పుకొచ్చారు. అదానీ గ్రూపుకు ఆర్థిక రంగంలోని ప్రభుత్వ సంస్థలు పరిమితంగానే ఎక్స్‌పోజర్‌నిచ్చాయని, అవి క్రాష్‌కు మూలకారణం కావు’ అంటూ ఆమె ప్రభుత్వ రంగ సంస్థలను సమర్థించుకొచ్చారు. ‘మదుపరుల విశ్వాసం ఇప్పటికీ ఉందని, అది కొనసాగుతుందని నమ్ముతున్నాను’ అని ఆమె సమర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News