Monday, December 23, 2024

మారో మారో…

- Advertisement -
- Advertisement -

Maro Maro lyrical song release from Thankyou

 

హీరో అక్కినేని నాగచైతన్య ‘మనం’ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘మారో మారో…’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. యూత్‌ఫుల్ మాస్ కాలేజ్ పాటగా చిత్రంలో వుండే ఈ సాంగ్‌కు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు. ఈ క్యాచీ పాటకు విశ్వ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఈ సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News