Thursday, January 23, 2025

మహిళపై మారేడ్‌పల్లి సిఐ అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: దంపతులపై సిఐ దాడి చేసి అనంతరం మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మారేడ్‌పల్లికి చెందిన సిఐ నాగేశ్వర్ రావు ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలి భర్తపై దాడి చేసి అనంతరం వారిని కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. వెంటనే వారు సిఐ నుంచి తప్పించుకొని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలిని తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. సిఐని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News