Thursday, January 23, 2025

ప్రేమవివాహం… భార్యలేని జీవితం వద్దని ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనారోగ్యంతో భార్య కన్నుమూయడంతో తన ప్రేమకురాలు లేదని మనోవేధనతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని మారేడుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పికెట్‌కు చెందిన అఖిల్ (24). మియాపూర్‌కు చెందిన మౌనిక(24) గంత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్యనారు. ఈ దంపతులకు ప్రణవ్ (2), హారిక(1) అనే పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో మౌనికి చనిపోవడంతో అఖిల్ మనోవేధనకు గురయ్యాడు.

Also Read: పని చేయని బిజెపి కుప్పిగంతులు!

భార్యలేని బతుకుఎందుకు అని పలుమార్లు స్నేహితులు, బంధువుల వద్ద అన్నాడు. శనివారం మధ్యాహ్నం భార్య చనిపోయి 21 రోజులు కావడంతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్నానం చేసి పూజలో కూర్చుంటానని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు డోర్ తంటినా తీయకపోవడంతో బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేసి చూడగా తన భార్య చీరతో ఉరేసుకొని కనిపించాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలు అనాథలు కావడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News