Wednesday, January 22, 2025

మహిళలను కించ పరుస్తున్న ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డి : మహిళ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలను కించ పరుస్తూ మాట్లాడుతున్నాడని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. బతుకమ్మ బోనాలు హారతులు ఇస్తే డబ్బులు ఇస్తామని దండోరాలు వేయిస్తూన్నాడని విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీతారావు మాట్లాడారు. బిఆర్‌ఎస్ నేతలు మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారని, మహిళలను అగౌరవ పరిస్తే వచ్చే ఎన్నికల్లో మీ సీట్లు సునామీలో కొట్టుకు పోతాయని విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితువు పలికారు. మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలకు క్షేమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News