Thursday, December 26, 2024

కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తా: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం తెల్కపల్లి మండలంలో మాట్లాడిన మర్రి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లను కాల్చి పడేస్తానని మర్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

తనకు జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తానని, కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తానని మర్రి హెచ్చరించారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చేయి ఊడిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, తెల్కపల్లి పాదయాత్రలో మర్రి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన మర్రి, కాంగ్రెస్ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News