Saturday, December 21, 2024

నిఖత్ జరీన్‌కు ఎంఎల్‌ఆర్‌ఐటి చేయూత

- Advertisement -
- Advertisement -

Marri Laxman Reddy Institute of Technology to support Nikhat financially

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడలకు అర్హత సాధించిన భారత స్టార్ బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్‌కు ఆర్థికంగా అండగా నిలిచేందుకు మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటి) ముందుకు వచ్చింది. నిఖత్ వచ్చే ఒలింపిక్స్ వరకు ప్రతి నెల 20 వేల రూపాయల నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు సంస్థ అంగీకరించింది. పట్టుదల, ఆటపై అంకితభావం, కఠోన సాధన వల్లే నిఖత్ ఈ స్థాయికి చేరుకుందని, ఆమెను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు ముందుకు సాగాలని ఎంఎల్‌ఆర్‌ఐటి సంస్థ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి సూచించారు. సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిఖత్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News