హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది. టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనడం కాంగ్రెస్ వల్ల కాదు’ అన్నారు. ఆయన తెలంగాణ అభివృద్ధి, కుటుంబ పాలన విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను శశిధర్ రెడ్డి కలిశాక, ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాజీనామా చేశాక మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై అనేక ఆరోపణలను చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ విప్ ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు. పరువు నష్టం కేసును ఎదుర్కొనాల్సి ఉంటుందని గురువారం లీగల్ నోటీస్ కూడా పంపించారు.
బిజెపిలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -