Wednesday, January 22, 2025

రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మాణికం ఠాగూర్

- Advertisement -
- Advertisement -

Marri Shashidhar Reddy Sensational Comments on Revanth

రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మాణికం ఠాగూర్
మర్రి శశిధర రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్‌ను పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏజంట్‌గా ఆరోపించారు. ఈ రకమైన సంచలన వ్యాఖ్యలకు చేసినందుకు గాను మర్రిశశిధర్‌రెడ్డిపై షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. వరంగల్ సభ నిర్వహణకు ముందు న్యూఢిల్లీలో రాహుల్ గాంధీతో నిర్వహించిన సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలపై మీడియా వేదికగా మాట్లాడొద్దని కూడా రాహుల్ గాంధీ సూచించారు. ఏదైనా ఉంటే పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పాలని కోరారు. పార్టీ వేదికలపై చర్చించాలని సూచించారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీకి నష్టం చేస్తే ఎంతటి పెద్ద నాయకుడైనా చర్యలు తప్పవని కూడా రాహుల్ గాంధీ హెచ్చరించారు. పార్టీ నేతలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసుల జారీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోల కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియోలనను పార్టీ నాయకత్వానికి పంపననున్నారని సమాచారం.

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు మర్రి శశిధర్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని మాణికం ఠాగూర్ చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వెలమ కులాన్ని ఢీకొట్టే శక్తి రెడ్డి సామాజిక వర్గానికే ఉందని గతంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్నారు. ఒక్క కులంతో ఏమీ కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉందని మాణికం ఠాగూర్ పార్టీ నేతలతో చెప్పారన్నారు. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లి పార్టీకి నష్టం చేసేలా ఉంటే ఆ వ్యాఖ్యల విషయమై పార్టీ వైఖరి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదా అని మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య ఈ వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఉందని చెబితే లాభం ఏమిటని ఆయన అడిగారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కలత చెందినట్లుగా మర్రిశశిధర్‌రెడ్డి చెప్పారు.

Marri Shashidhar Reddy Sensational Comments on Revanth

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News