Monday, December 23, 2024

కొంపముంచిన ముద్దు… పెళ్లి రద్దు

- Advertisement -
- Advertisement -

 

లక్నో: పెళ్లి వేడుక జరుగుతుండగా వరుడు వధువుకు ముద్దు పెట్టాడని ఆమె తన వివాహాన్ని రద్దు చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం శంబాల్ ప్రాంతంలో జరిగింది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకంలో భాగంగా బదాయ ప్రాంతంలో బిల్సీ గ్రామానికి చెందిన యువకుడు. బహ్జోయ్ ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఆచారాల్లో భాగంగా మాల వేస్తుండగా యువతికి యువకుడు ముద్దు పెట్టాడు. పెళ్లి ఎలా ముద్దు పెడుతాడని కోపంతో రగిలిపోయిన యువతి పెళ్లి రద్దు చేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆ వరుడిని వదువు పెళ్లి చేసుకునే సమస్యే లేదని తేల్చి చెప్పడంతో వివాహం రద్దయింది. గతంలో చికెన్, మటన్ కూర పెట్టలేదని పెళ్లిలు రద్దైన రోజులు ఉన్నాయి. వధువు, వరుడు నచ్చలేదని, గతంలో లవ్ ఎఫైర్ ఉండడంతో పెళ్లి రద్దు చేసుకున్న విషయాలు తెలిసినవే. వధువు, వరుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడంతో పెళ్లిలు రద్దయ్యాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News