Friday, December 20, 2024

పెళ్లిని రద్దు చేసిన మూలుగ బొక్క

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: బంధువులకు మూలుగ బొక్క వేయలేదని వివాహం రద్దు చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించాల్సిన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. కట్న కానుకలు అన్ని మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం సందర్భంగా యువతి ఇంట్లో మాంసహారంతో భోజనం ఏర్పాటు చేశారు. అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వైపుల బంధువుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చివరలో పెళ్లి రద్దు చేసుకోవడంతో బలగం సినిమా గుర్తుకు వచ్చింది. అత్తగారింట్లో అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ బామ్మర్థులకు మధ్య గొడవ జరిగింది. మామ చనిపోయేవరకు అల్లుడు తన అత్తగారింటికి రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News