Friday, November 8, 2024

పేదింటి ఆడపిల్లలకు అండగా నిలుస్తున్న ఉపసర్పంచ్

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ : ప్రజల కోసం ఏదైన చేయాలంటే ఆర్థికంగా స్థిరపడి డబ్బులే ఉండాల్సిన అవసరం లేదని, చిత్త శుద్దితో చేయాలనే సంకల్పం ఉంటే చాలు ప్రజలకు అండగా ఉండవచ్చు అనడానికి నిదర్శణం ఘట్‌కేసర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కట్ట సత్యనారాయణ గౌడ్ అని చెప్పవచ్చును. గత పంచాయితీ ఎన్నికలలో వార్డు సభ్యునిగా గెలిచి ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన గ్రామ ప్రజలకు ఎదైన చేయాలనే తపనతో వచ్చిందే పెండ్లి కానుక స్వయం పథకం. దీనితో గ్రామంలో పెండ్లీ చేసుకునే ప్రతి ఆడపడుచుకు ఆ ఇంటి పెద్దన్నగా 30వేల 116 రూపాయలతో పెండ్లి కానుక అందించే కార్యక్రమం చేపట్టారు.

ఇది చేపట్టి దాదాపు మూడు సంవత్సరాల కాలంలో నలభైమందికి పైగా పెండ్లి చెసుకొని అత్తారింటికి వెళ్ళిన ఆడపిళ్ళలకు తను చేపట్టిన పెండ్లి కానుకను అందజేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పవచ్చును. ఆడపిల్లల పెండ్లీలు అంటే పేద మధ్య రగతి తల్లిదండ్రులకు భారంగా మారిన తరుణంలో తన వంతు సహాయంగా అట్టి తల్లిదండ్రులకు అండగా నిలస్తున్న సత్యనారాయణ గౌడ్ పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తన మధ్య తరగతి కుటుంబానికి ఆర్థిక భారం అయినప్పటికి తన సంకల్పం గొప్పదంటూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతుండడం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుందనవచ్చును.

ఈ మేరకు బుధవారం వేంకటాపూర్ అనుబంధ గ్రామం తెనుగూడెంకు చెందిన మెడగోని రాణి బాలరాజ్ ముదిరాజ్ దంపతుల కుమార్తె ఐశ్వర్య, వరుడు లక్ష్మణ్‌ల వివాహ వేడుకలలో కట్ట సత్యనారాయణ మానస దంపతులు పాల్గొని నూతన వధువరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి తను చేపట్టిన పెండ్లి కానుక స్వయం పథకం ద్వారా 30,116 రూపాలను వధువుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News