Monday, December 23, 2024

చైనాలో పెళ్లి చేసుకుంటే నెల రోజులు సెలవు ప్లస్ జీతం!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో జనాభా గణనీయంగా తగ్గిపోతుండడంతో అక్కడ అనేక ఆఫర్లు ఇస్తోంది ప్రభుత్వం. కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు నెల రోజుల సెలవు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తోంది. పిల్లల్ని కనమంటూ ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇటీవలి కాలం వరకు ఒక జంటకు ఒక్క సంతానమే అన్న నియమాన్ని పాటించిన ఆ దేశం పరిస్థితులు మారడంతో తన విధానాన్ని కూడా మార్చుకుంది.

కొత్తగా పెళ్లయినవారికి నెల రోజుల సెలవే కాదు. వారి జీతం కూడా దక్కుతుంది. వాస్తవానికి చైనాలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఇప్పటి వరకు మూడు రోజులే సెలవిచ్చేవారు. కానీ జనాభాను పెంచాలన్న యావతో ఇప్పుడు షాంగ్జీ తదితర ప్రాంతాల్లో జీతంతో పాటు నెల రోజుల సెలవును కూడా ఇస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి కమ్యూనిస్టు పార్టీకి చెందిన అధికారిక పత్రిక ‘పీపుల్స్ డైలీ’ పేర్కొంది. ఈ నెల(ఫిబ్రవరి) నుంచే ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు. దీంతో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News