Monday, January 20, 2025

వచ్చేనెల నుంచి శుభముహూర్తాలు షురూ

- Advertisement -
- Advertisement -

వచ్చేనెల నుంచి శుభముహూర్తాలు ఉండడంతో వేదపండితులు ముహూర్తాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుభముహూర్తాలతో తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాలు భారీగా జరగనున్నాయి. వచ్చే నెల (నవంబర్) 3వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు మొదలై, 20వ తేదీ వరకు నవంబర్ నెలలో మొత్తం 12 శుభముహూర్తాలు ఉన్నట్లుగా వేద పండితులు పేర్కొంటున్నారు. దీపావళి పర్వదినం అయిపోగానే నవంబర్‌లో(కార్తీక మాసం)లో 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 7వ తేదీన ఉదయం, రాత్రి, 8వ తేదీ ఉదయం, 10వ తేదీ ఉదయం, రాత్రి, 13వ తేదీ ఉదయం 14న ఉదయం, 17వ తేదీన ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, 20వ తేదీన ఉదయం మంచి ముహూర్తాలు న్నాయని వేదపండితులు పేర్కొంటున్నారు.

ఇక డిసెంబర్, జనవరి నెలల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు పేర్కొన్నారు. డిసెంబర్ (మార్గశిరం) నెలలో 4, 5, 6, 11, 20, 25 తేదీల్లో వివాహ బంధాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, మాఘ మాసంలో భాగంగా వచ్చే ఏడాది జనవరి (మాఘమాసం)లో 31వ తేదీన ఉదయం సమయంలో, రాత్రి రెండు శుభ ముహూర్తాలుండగా ఫిబ్రవరి నెలలో 2, 7 తేదీల్లో ఉదయం, రాత్రి మంచి ముహూర్తాలు ఉన్నాయని, దీంతోపాటు 13వ తేదీన ఉదయం, 14వ తేదీ రాత్రి, 16 వ తేదీన మంచి ముహూర్తాలు న్నాయని పండితులు తెలిపారు. 20వ తేదీన ఉదయం, రాత్రి, 22, 23 తేదీల్లో రెండేసి ముహూర్తాలున్నాయని శుభకార్యాలకు ఇవి అనువైనవని పండితులు పేర్కొంటున్నారు. ఇక ఫాల్గుణంలో మార్చి 2వ తేదీన ఉదయం రెండు, రాత్రి రెండు శుభ ముహూర్తాలుండగా 6వ తేదీన ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో కల్యాణ ఘడియలు ఉన్నాయని పండితులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News