Monday, December 23, 2024

మైనర్ బాలికకు ప్రేమ వివాహం చేసిన గ్రామపంచాయతీ పెద్దలు..

- Advertisement -
- Advertisement -

అనంతపురం జిల్లాలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమపేరుతో వంచించాడు. తరచూ బాలిక ఇంటివద్దకు వెళ్ళడంతో కుటుంబ సభ్యులు మందలించారు. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ నెల 18న పంచాయితీ చేశారు. పంచాయతీ పెద్దలు బాలికకు యువకుడితో తాళి కట్టించారు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారులు దృష్టి సారించారు.

సమాచారం అందుకున్న ఐసిడిఎస్ పీడి అధికారులు గ్రామానికి చేరుకొని బాలికను విచారించారు. బాలికకు తాళి కట్టించిన వారి పై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. బాలికను చైల్డ్‌ హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బాల్య వివాహం చట్ట రీత్యా నేరమని.. కనుక బాలిక వివాహం చెల్లుబాటు కాదని తెలిపారు. బాలికను కేజీబీవీ పాఠశాలలో ఉంచి మేజర్‌ అయ్యే వరకు చదివిస్తామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ బాలిక మెడలో తాళి కట్టిన యువకుడిని, అందుకు ప్రొత్సాహించిన గ్రామ పెద్దలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వారిని మందలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News