Monday, November 18, 2024

వితంతువు ప్రాణం తీసిన వివాహేతర సంబంధం…

- Advertisement -
- Advertisement -

Married Man Slits Paramours Throat

గాంధీనగర్: ఓ వివాహితుడు వితంతువులో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆమెను ప్రియుడు హత్య చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం సవ్లి తాలూకా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లందాపూరా గ్రామంలో శైలేష్ వాఘేలా (35) అనే వివాహితుడు హంస పర్మార్ అనే వితంతువుతో గత ఆరు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు మధ్య పెళ్లి ప్రస్తవన వచ్చింది. అప్పటికే వాఘేలాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండడంతో హంసను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకరావడంతో చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక రోజు కాలువ వద్దకు రావాలని ఆమెకు సూచించాడు. ఆమె కాలువ వద్దకు రాగానే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఘటనా స్థలంలో నుంచి వాఘేలా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News