Monday, January 20, 2025

వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వాంకిడి: వరకట్నం వేధింపులు భరించలేక ఉరి వేసుకొని అదే అంజలి (18) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తేజిగూడకు చెందిన గౌత్రే సుమిత్ర, బాలాజీ దంపతులకు ఇద్దరు పిల్లలు,

పెద్ద కుతురైన అంజలి మూడు సంవత్సరాల క్రీతం అదే గ్రామానికి చెం దిన అదే శంకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిపారు. కొంత కాలానికి అల్లుడు శంకర్‌కి లక్ష రూపాయల వరకట్నం ఇచ్చార ని, గత కోంత కాలం నుండి అధిక వరకట్నం కోసం అత్త, మామ, భర్త శంకర్‌లు వేధింపులకు గురి చేస్తు ఉండేవారని అన్నారు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన చీరతో దూలానికి ఉరివేసుకోని అంజలి ఆత్మహత్య చేసుకుంది. కాగా తన బిడ్డను అత్త, మామ, భర్త శంకర్‌లు కోట్టి చంపి ఆత్మహత్యగా చిత్రికరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News