Monday, December 23, 2024

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఫిలీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….విశ్వనాథ్, శిరీష దంపతులు ఫిలీంనగర్‌లో ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడ మనీష్ ఉన్నాడు. శిరీష ప్రస్తుతం మూడు నెలల గర్భిని. శిరీషను గత కొంత కాలం నుంచి భర్త, అత్తమామ వేధింపులకు గురిచేస్తున్నారు. రోజురోజుకు వారి వేధింపులు ఎక్కువ కావడంతో శిరీష భరించలేపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది కుమారుడు మనీష్‌కు ఉరివేసి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News