Monday, December 23, 2024

అబ్దుల్లాపూర్‌మెట్ జంటహత్యల కేసు.. భార్యతోపాటు ప్రియుడిని హతమార్చిన..

- Advertisement -
- Advertisement -

Married Woman and her lover murder in Abdullapurmet

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ జంటహత్యల కేసులో పురోగతి లభించింది. భార్య జ్యోతి(28)తోపాటు ఆమె ప్రియుడు యశ్వంత్(22)ను భర్త శ్రీనివాస్ సుఫారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారనాసి భౌద్ధనగర్‌కు చెందిన ఎడ్ల యశ్వంత్ తో శ్రీనివాస్ భార్య జ్యోతి కొద్దిరోజులుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరు తరుచూ శివారు ప్రాంతలోని కొత్తగూడం బ్రిడ్జి సమీపంలోకి వచ్చి వెళ్తున్నారనే విషయం తెలుసుకున్న భర్త.. భార్య జ్యోతి, యశ్వంత్ ఇద్దరినీ చంపేందుకు గ్యాంగ్ కు సుఫారీ ఇచ్చి హత్య చేయించాడు. మంగళవారం నగర శివారులో కుళ్ళిన మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఈ జంట హత్యలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Married Woman and her lover murder in Abdullapurmet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News