- Advertisement -
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు మండలం సోమయాజులపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలిని భారతిగా గుర్తించారు. నెల క్రితం భారతికి వివాహం జరిగింది. ఆషాఢమాసం సందర్భంగా భారతి పుట్టింటికి వెళ్లింది. వారం క్రితం ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు గోపాల్ అనే యువకుడిపై అనుమానంతో విచారించారు. భారతిని గోపాల్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రేమవ్యవహారంతోనే చంపినట్లు గోపాల్ పోలీసులకు తెలిపాడు. అటవీ ప్రాంతంలోని ఎడ్డోడుకనుమలో భారతి మృతదేహాన్ని కనుగోన్నారు. సంఘటనాస్థలంలోనే భారతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భారతి ఆభరణాలను గోపాల్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గోపాల్ ను పోలీసులు అదుపులోకి అరెస్టు చేశారు.
- Advertisement -