Friday, December 20, 2024

బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోనరావుపేట: కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామానికి చెందిన గోపు పరుశు రాములు,రేఖలు ఇద్దరు దంపతులు.వారికి ఇద్దరు కూతుర్లు రేవతి,అధ్య ఉన్నారు.అయితే ఆదివారం భర్త పరుశు రాములు భార్య గోపు.రేఖ(30)కి మధ్యలో గోడవకావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రేఖ(30) సాయంత్రం సమయంలో వారి పొలం దగ్గర ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు తెలిపారు. దీంతో మల్కాపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

విషయం మృతురాలి తల్లిదండ్రులకు,బంధువులకు తెలియడంతో అత్తవారింటి దగ్గర చేరుకుని ఆందోళన చేశారు. దీంతో స్తానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలికి చేరున్నారు . దీంతో గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పెద్ద ఎత్తున్న సంఘటన స్థలంలో పోలీసులు మోహరించారు.అయితే రాత్రి సమయం కావడంతో మృతదేహాన్ని తీయడానికి సమయం పడుతుబడదని ఎస్.ఐ. ఎన్.రమాకాంత్ అన్నారు.దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశానని,కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అన్నారు.మృతికి గల కారణాలు ఇంకా తెలియవలసి ఉన్నదని ఆయన అన్నాడు. గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News