పుల్కల్: అదనపు వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సం ఘటన బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం… వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల ప్రవీణ్‌కుమార్ గతరెండు సంవత్సరాల క్రితం హత్నూర మండలంకొత్తగూడెం గ్రామానికి చెందిన వనం సురేఖ అలియాస్ లక్ష్మి(24) గారితో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్న రూపంలో రూ. 13 లక్షలు నగదును ఇచ్చారు. వివాహం జరిగి ఆరునెలలపాటు ఇద్దరు సుఖసంతోషాలతో ఉన్నారు. అప్పటినుంచి భర్త అయిన ఎర్రగొల్ల శ్రీనివాస్, మరిది ఎర్రగొల్ల మల్లిఖార్జున్ వీరు అందరు కలిసి అదనపు కట్నం గురించి వేదింపులు ప్రారంభించారు. వీరి వేధింపులు భరించలేక గత సంవత్సరం సురేఖ అలియాస్ లక్ష్మి గర్భవతి ఉండగా 16-02-2022 విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్సనిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స నిర్వహించి ప్రాణాలతో బయటపడింది.
అప్పట్లో పెద్దల సమక్షంలో పంచాయతీ ని ర్వహించి అదనపు కట్న వేదింపుల గురించి మళ్లీ వేధించవద్దని పలువురు పెద్దల సమక్షంలో మాట్లాడారు. ఆతర్వాత గర్భవతిగా ఉన్న లక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పట్లో డోలారోహణంకు అదనపు కట్నంగా 50వేల రూపాయల నగదు చెల్లించారు. మళ్లీ పుట్టువెంట్రుకలను తీయించడానికి కొమరవెల్లికి వెళ్లినప్పుడు మళ్లీ 50వేల రూపాయలను అదనంగా ఇచ్చారు. మళ్లీ పాప పుట్టినరోజు వేడుకలకు అదనంగా మళ్లీ 50వేల రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. ఇంత ఇచ్చిన మళ్లీ అదనపు కట్నం తేవాలని భర్త అత్తమామలు మరిది అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి ఉంది.
అయినా అదనపు కట్నం వేధింపులతో ఇంతటితో ఆగలేవు మళ్లీ అదనపు కట్నంతేవాలని ఒత్తిడి చేయడంతో 16-న సాయంత్రం సమయంలో అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యు లు చికిత్సనిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూసాయంత్రం మ రణించిందని వైద్యులు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న లక్ష్మితల్లిగారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతర ం తమ కూతురు ముమ్మాటికి అదనపు కట్న వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని లక్ష్మితల్లితండ్రులు అన్నారు. తమ కూతురిని వేధించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని లక్ష్మితల్లితండ్రులు పుల్కల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అట్టి కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టి లక్ష్మీమృతికి కారణమైన భర్త, అత్త, మామ, మరిదిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేస్తామని పుల్కల్ ఎస్‌ఐ తెలిపారు.