Monday, December 23, 2024

కాటేసిన ‘ఖాకీ’

- Advertisement -
- Advertisement -

మారేడ్‌పల్లి సిఐ అత్యాచారం చేశాడంటూ వివాహిత ఫిర్యాదు కిడ్నాప్,
అత్యాచారం, హత్యాయత్నం, ఆయుధ చట్టాల కింద కేసు విధుల
నుంచి సస్పెండ్ చేసిన సిపి సివి ఆనంద్ పరారీలో ఇన్‌స్పెక్టర్
నాగేశ్వరరావు అరెస్ట్‌కు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు

మన తెలంగాణ/హైదరాబాద్, (సిటీబ్యూరో/వనస్థలిపురం): పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు తన భర్తను అపహరించి హత్య చేసేందుకు యత్నించిన మారేడ్‌పల్లి సిఐ నాగేశ్వరావుపై బాధితురాలు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన వనస్థలిపురం పోలీసులు సిఐ నాగేశ్వరరావుపై ఐపిసి సెక్షన్స్ 452, 376(2), 307, 448, 365లతో పాటు ఆయుధ చట్టం సెక్షన్ ఆఫ్ 30 కింద అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ, ట్రెస్‌పాస్ కే సును నమోదు చేశారు. ఈక్రమంలో వనస్థలిపు రం పోలీసుల నివేదిక మేరకు నగర సిపి సివి ఆ నంద్ శనివారం నాడు సిఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అపహరణ, అత్యాచారం, హత్యాయత్నం, ఆయుధ చ ట్టం కింద సిఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇటీవల బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో ఎపి ఎంపి టిజి వెంకటేశ్ పేరు ఎఫ్‌ఎస్‌ఐఆర్‌లో చేర్చేందుకు సదరు సిఐ నాగేశ్వరరావు రూ. 25 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా సిఐ నాగేశ్వరరావు గతంలో ఎస్‌వొటి, టాస్క్‌ఫోర్స్,బంజారాహిల్స్‌ల విధులు నిర్వహించాడని, ఆయా పోలీ సు స్టేషన్‌లలో ఆయన పనితీరుపై నివేదిక ఇవ్వాలని సిపి సివి ఆనంద్ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలియవచ్చింది.

ఇదీ జరిగింది

రంగారెడ్డి జిల్లా, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరమణ కాలనీలో దంపతులు ఉంటున్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంట ల సమయంలో బాధితురాలి ఇంటికి వచ్చిన ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఇంటికి బాధితురాలి భర్త రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి భార్య, భర్తను తెల్లవారుజామున 4గంటలకు కారు(టిఎస్08 ఇఎ 0633)లో తీసుకుని వెళ్లాడు. కారులో నాగార్జున సాగర్ వైపు వెళ్తుండగా ఇబ్రహీపట్నం చెరువు కట్ట వద్దకు రాగానే కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో కారు నాలుగ పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన దంపతులు కారులో నుంచి బయటపడి ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్న ఆర్‌టిసి బస్సు ఎక్కి నగరానికి వచ్చారు. వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కాగా బాధితులను అపహరించిన కారు ఇఎ 0633) హైదరాబాద్ నగరంలోని ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ అధికారికి చెందినదిగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

చీటింగ్ కేసులో పరిచయం :

క్రెడిట్ కార్డు ఛీటింగ్ కేసులో బాధితురాలి భర్తను 2018 లో అప్పుడు ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగేశ్వర్ రావు అరెస్టు చేశారు. భర్తను కలిసేందుకు బాధితురాలు తరచూ రావడంతో నాగేశ్వర్ రావు ఆమెతో పరిచయం పెంచుకున్నా డు. తనతో వివాహేతరం సం బంధం పెట్టుకుంటే నీ భర్త ను కేసు నుంచి బయటపడేస్తానని చెప్పడంతో బాధితురాలు అతడితో సన్నిహితంగా ఉంటోంది. ఇచ్చిన మాట ప్రకారం నాగేశ్వర్ రావు బాధితురాలి భర్తను కేసు నుంచి బయటపడేయడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిం ది. దీంతో తరచూ బాధితురాలి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈక్రమంలో ఆమెపై కన్నేసిన సిఐ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది.

సిఐ ఫాం హౌస్‌లో :

గత కొంతకాలంగా బాధితురాలిని లోబరుచుకోవాలని యత్నించిన సిఐకి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని భావించాడు. ఈక్రమంలో ఇబ్రహీంపట్నం శివారులో సిఐకి చెందిన ఫాం హౌస్‌లో వ్యవసాయ పనులు చూసుకోమని ఆమె భర్తను వేధించాడు. అయితే నెలకు రూ. 10వేల చొప్పున అతడి భార్య బ్యాంక్ ఖాతాలో వేస్తానని చెప్పా డు. తాను చెప్పినట్లు వినకుంటే గంజాయి కేసులో ఇరికిస్తానని చెప్పడంతో భయపడి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. బాధితురాలి భర్తకు నెలకు రూ. 10,000 మొదట్లో ఇచ్చేవాడు, తర్వాత నుంచి రూ.15, 000 ఇస్తూ వచ్చాడు. ఓ రోజు బాధితురాలిని ఆమె భర్తకు తెలియకుండా వ్యవసాయ క్షేత్రానికి తీసుకుని వచ్చాడు. దీంతో ఆగ్రహం చెందిన బాధితురాలి భర్తను నిలదీశాడు, ఈ విషయం మీ కుటుం సభ్యులకు చెబుతానని బెదిరించాడు. బాధితురాలి భర్త వల్ల తనకు ఇబ్బందులు తప్పవని భావించిన నాగేశ్వర్ రావు తన వద్ద పనిచేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్‌ను పంపించి భార్యభర్తను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. తర్వాత బాధితురాలి భర్తను తీవ్రంగా కొట్టి అతడి చేతిలో గంజాయి ప్యాకెట్లు పెట్టి ఫొటోలు తీశాడు. గంజాయి సరఫరా చేశావని కేసు నమోదు చేస్తానని బెదిరించాడని బాధితురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు…

చెరువు కట్టపై కారు ప్రమాదానికి గురైందని సమాచారం రావడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఇద్దరు గాయపడి కారులో ఉన్నారు. వారిని ప్రశ్నించగా తాను వెస్ట్‌మారెడ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ నాగేశ్వర్ రావు అని చెప్పడంతో వారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇబ్రహీం పట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

బెదిరించి అత్యాచారం :

సిఐ నాగేశ్వరరావు తనను బెదిరించి తన భార్యపై ఆఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి భర్త వాపోయాడు. నగరం విడిచి వెళ్లిపోవాలని తుపాకి చూపి బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించాడు. ఇద్దరిని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఊరులో వదిలి పెట్టడానికి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరగడంతో త ప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. ఒక దశలో అగ్రహంతో తాను సిఐపై కర్రతో దాడి కూడా చేశానని -బాధితురాలి భర్త పేర్కొన్నాడు. అత్యాచా రం చేసిన సిఐ నాగేశ్వరరావు బండారం బయటపడకూడదన్న ఉద్దేశంతో తమ కారులో ఎక్కించుకొని ఇబ్రహీంపట్నం వైపు వెళుతుండగా మార్గమధ్యంలో కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యిందని బాధితులు పోలీసులకు తెలిపారు. ఈక్రమంలో ప్రమాదం జరిగిన వెంటనే సిఐ నుం చి తప్పించుకొని వనస్థలిపురం పోలీసుల్ని ఆశ్రయిం చి ఫిర్యాదు చేశామని తెలిపారు. వనస్థలిపురం పోలీసులు వెంటనే తన భార్యను వైద్యపరీక్షలకు పంపించారని, సం ఘటనా స్థలంలో వనస్థలిపురం పోలీసులు కొన్ని ఆధారాల్ని సేకరించారని బాధితురాలి భర్త వివరించాడు.

వివరాలు త్వరలో వెల్లడిస్తాం

మారేడ్‌పల్లి సిఐ నాగేశ్వరరావు మా అదుపులో లేడని వనస్థలిపురం ఎపిసి పురుషోత్తం తెలిపారు. ఈ క్రమంలో సిఐ నాగేశ్వరరావుపై నమోదైన హత్యాయత్నం, అత్యాచారం కేసు వివరాలను ఆయన వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గతంలో బాధితురాలి భర్త సిఐ వ్యవసాయ క్షేత్రంలో పనిచేశాడని ఎసిపి వెల్లడించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News