Monday, January 20, 2025

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ : మండల కేంద్రం చండ్రుగొండలోని అంబేద్కర్‌నగర్‌ కు చెందిన కుక్కముడి శ్రావణి (25) ఆదివారం అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం వివారలిలా ఉన్నాయి. శ్రావణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆమె తుదిశ్వాస విడిచింది. భర్తే హతమర్చి ఆత్మహత్యగా చీత్రికరించినట్లు శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా అంబేద్కర్‌నగర్ కు చెందిన శ్రావణి, దివ్య తేజ్‌ కుమార్ నాలుగేళ్ళ క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. రెండేళ్ళు గా బార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలూరుపాడు సీఐ వసంతకుమార్, ఎస్‌ఐ విజయలక్ష్మి సంఘటన స్థలాన్ని సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News