- Advertisement -
హైదరాబాద్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళ్ హాట్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. అప్పర్ దూల్ పేట ఆరాంఘర్ కాలనీకి చెందిన అస్మితకు రహీంపురకు చెందిన అమన్ కుమార్ సింగ్ తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అమన్ కుమార్ సింగ్ గచ్చిబౌలిలో ప్రవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కాగా డిసెంబర్ 26 ,2023న రాత్రి బిపి ఎక్కువై మృతి చెందాడు.
అప్పటి నుంచి అస్మిత భర్త ఫోటో దగ్గర పెట్టుకొని బాధపడేది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన అస్మిత మంగళవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్లారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -